న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.  


వివరాలు..


* సీనియర్ టెక్నికల్ అసోసియేట్: 93 పోస్టులు


రిజర్వేషన్లు: జనరల్(యూఆర్)-43, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-24, ఎస్సీ-13, ఎస్టీ-06.


విభాగాలవారీగా ఖాళీలు: సివిల్-60, ఎలక్ట్రికల్-20, సిగ్నల్ & టెలికాం-13.


అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: 28.08.2023 నాటికి 20 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: గేట్ స్కోర్ (2019- 2023 మధ్య) ఆధారంగా, ఒరిజినల్ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.


వేతనం: నెలకు రూ.32,000 నుంచి రూ.37,000


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.08.2023.


Notification


Online Application


Website


ALSO READ:


వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌లో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌ లిమిటెడ్ డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మజగావ్‌డాక్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 531 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..