North Central Railway Aapprentices: ప్రయాగ్‌రాజ్‌ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న నార్త్ సెంట్రల్ రైల్వే(NCR)- రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.


వివరాలు..


* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 1,697 ఖాళీలు


డివిజన్‌/వర్క్‌షాప్‌: ప్రయాగ్‌రాజ్ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్. 


అర్హత:  50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాట్స్‌మన్, స్టెనోగ్రాఫర్ తదితరాలు.


వయోపరిమితి: 14.12.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.12.2023


Notification


Online Application


Website


ALSO READ:


సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
కోల్‌కతా ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (SER)-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,104 అప్రెంటిస్ పోస్టులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీచేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...