Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయనకు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆయనకు ఇన్ స్టాలో ఏకంగా 23.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘పుష్ప’ మూవీ బ్లాక్ బస్టర్  హిట్ అయ్యాక, ఆయన ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. సౌత్ కు ధీటుగా నార్త్ లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు వాళ్లంతా ‘పుష్ప 2’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


లేడీ ఫ్యాన్ తో బన్నీ సెల్పీ వీడియో


ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సెంటర్ లో అందరినీ విష్ చేస్తూ తన ఓటు వేసి వెళ్లబోయారు. అప్పుడే ఆయనను అశ్విని అనే ఓ లేడీ ఫ్యాన్ కలిసింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఇందులో ఆయన మాట్లాడిన మాటలు ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. ఈ వీడియోతో ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరుగుతారని చెప్పారు. సెల్ఫీ వీడియో తీస్తూ బన్నీ.. “నీకు ఎంతమంది ఫాలోవర్లు కావాలి? ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?” అని అడిగారు. దానికి ఆ అమ్మాయి ‘‘13 వేల మంది ఉన్నారు” అని చెప్తుంది. “మినిమమ్ ఇప్పుడు ఎంతకి టచ్ అవ్వాలి అనుకుంటున్నావు” అని మళ్లీ అడుగుతాడు. “30 వేలకు టచ్ కావాలి అనుకుంటున్నాను” అని అంటుంది. “30K కావాలా? ఈ వీడియోతో వస్తారా?” అంటూ నవ్వుతూ సెల్ఫీ వీడియో తీశారు బన్నీ. ఈ వీడియోను ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. క్షణాల్లోనే ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. అటు ట్విట్టర్ లోనూ ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. వాస్తవానికి ఈ వీడియోను అశ్విని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసే సమయానికి ఆమె ఫాలోవర్స్ సంఖ్య 13 వేలు ఉంది. ఈ వీడియో పోస్టు చేసిన తర్వాత పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరుగుతున్నారు. అయితే, కొందరు ఆ అమ్మాయి బన్నీ ఇంట్లో హౌస్ హెల్పర్ అని అంటున్నారు. మరి అందులో నిజమెంటో తెలియాల్సి ఉంది.






‘పుష్ప 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ


అల్లు అర్జున్ చివరి సారిగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ది రైజ్'లో కనిపించారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా 'పుష్ప: ది రూల్' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీ ఆగస్టు 15, 2024న థియేటర్లలో విడుదల కానుంది. అటు బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో 'ఐకాన్' అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు దర్శకులు కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగాలతో ఒక్కొక్క సినిమా చేయబోతున్నారు.


Read Also: ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply