Telangana Assembly Election 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ నెమ్మదిగా జరిగింది. కొన్ని చోట్ల 12 గంటల తరువాత ఓటర్లు బయటకు వచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 

పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయంపై డీఈవోలతో సీఈవో వికాస్‌రాజ్‌ కోఆర్డీనేట్‌ అయ్యారు.

రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంల మొరాయింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సమస్యలను ప్రస్తావిస్తూ సీఈవో వికాస్‌రాజ్‌కు లేఖ రాసింది. ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. లేని పక్షంలో పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు సీఈవోను కోరారు. 

హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఓటు హక్కు వినియోగించుకోవాడానికి హైదరాబాద్ ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం  3 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైంది.  సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది. 

మధ్యాహ్నం  3 గంటల వరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 51.89 

వరుస సంఖ్య జిల్లా పేరు  పోలింగ్ శాతం 
1 ఆదిలాబాద్   62.3%
2 భద్రాద్రి 58.3%
3 హైదరాబాద్ 31.1%  
4 జగిత్యాల 58.6%
5 జనగామ  62.2%
6 భూపాలపల్లి  64.3%
7 గద్వాల 64.4%
8 కామారెడ్డి 59%
9 కరీంనగర్ 56%  
10 ఖమ్మం 63.6% 
11 కుమరంభీం 59.6%
12 మహబూబ్‌ నగర్‌ 65%  
13 మంచిర్యాల 59.1%
14 మెదక్  69.3%
15
మేడ్చల్ మల్కాజిగిరి

 38.2%
16 ములుగు       67.8%
17 నాగర్ కర్నూల్  57.5%
18 నల్గొండ    59.9%
19 నిజామాబాద్    56.5%  
  నారాయణపేట  57.1%
20 నిర్మల్ 60.3%
21 పెద్దపల్లి       59.2%
22  రాజన్న సిరిసిల్ల  56.6%
23 రంగారెడ్డి  42.4%
24 సంగారెడ్డి   56.2%
25 సిద్దిపేట  64.9%
26 సూర్యాపేట      62%
27 వికారాబాద్     57.6%
28 వనపర్తి  60%
29 వరంగల్    52.2%
30 యాదాద్రి భువనగిరి  64%