NLC Recruitment: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 239 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఎన్‌ఎల్‌సీఐఎల్‌ ప్రాజెక్ట్‌ ఎఫెక్టెడ్‌ పర్సన్స్‌ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెన్త్‌ స్టాండర్డ్, ఐటీఐ, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

Continues below advertisement


వివరాలు..


ఖాళీల సంఖ్య: 239.


⏩ ఇండస్ట్రియల్ ట్రైనీ/ ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్ (ఒ&ఎం): 100 పోస్టులు


⏩ ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ అండ్‌ సపోర్ట్ సర్వీసెస్): 139 పోస్టులు


శిక్షణ వ్యవధి: 3 సంవత్సరాలు.


అర్హత: టెన్త్‌ స్టాండర్డ్, ఐటీఐ, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా.


గరిష్ఠ వయోపరిమితి: 1.03.2024 నాటికి యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 37 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.


స్టైపెండ్‌: నెలకు ఇండస్ట్రియల్ ట్రైనీ/ ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్ (ఒ&ఎం) పోస్టుకి మొదటి సంవత్సరం రూ.18,000, రెండవ సంవత్సరం రూ.20,000, మూడవ సంవత్సరం రూ.22,000. ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ అండ్‌ సపోర్ట్ సర్వీసెస్) పోస్టుకి మొదటి సంవత్సరం రూ.14,000, రెండవ సంవత్సరం రూ.16,000, మూడవ సంవత్సరం రూ.18,000. చెల్లిస్తారు. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2024.


Notification


Website


ALSO READ: 


సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌ - హైదరాబాద్‌లో 96 సూపర్‌వైజర్, టెక్నీషియన్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
Security Printing Press, Hyderabad Notification: మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Singareni Recruitment Notification: సింగరేణిలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. గతనెలలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఇటీవల అంతర్గత అభ్యర్థుల ద్వారా ఖాళీల భర్తీకి సింగరేణి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఇక తాజాగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మరో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు విడుదల చేశారు. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 4న సాయంత్రం 45 గంటల్లోపు  ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సింగరేణి యాజమాన్యం సూచించింది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...