పట్నాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 12, 13వ తేదీలలో సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.


వివరాలు..


* ఫ్యాకల్టీ పోస్టులు.


విభాగాలు: కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌.


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: నిబంధనల మేరకు.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.


ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ఇంటర్వ్యూ వేదిక: మెయిన్‌ బిల్డింగ్‌, నిట్‌ పట్నా.


ఇంటర్వ్యూ తేదీలు: 12, 13.08.2023.


Notification


Website



Also Read:


తెలంగాణలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐఏసీఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకి ఆగస్టు1వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial