NIMS Recruitment: నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Continues below advertisement

NIMS Recruitment: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

వివరాలు..

మొత్తం ఖాళీలు: 65

* ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్)     

విభాగాలు: అనస్థీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ అండ్‌ వాస్కులర్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ, పాథాలజీ ఆంకాలజీ, రుమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ వాస్కులర్ సర్జరీ.

అర్హతలు: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000. ఇతరులకు రూ.3000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

చినునామా:
The Executive Registrar,
Nizam‟s Institute of Medical Sciences,
2nd floor, Old Block,
Punjagutta, Hyderabad-500082,
Telangana State, India.

ఎంపిక ప్రక్రియ: అర్హత/ అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరితేది: 30.09.2023.  

Website

                 

ALSO READ:

ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా
ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారికి 60 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో బయోడేటా పూర్తి వివరాలతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను జతచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించి, అక్టోబరు 6లోగా దరఖాస్తు హార్డ్ కాపీలను నిర్ణీత చిరునామాకు చేరేలా పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola