NHPC Recruitment 2026: ఇంజినీరింగ్ పూర్తి చేసి, గేట్ క్వాలిఫై అయిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం లభించింది. జలవిద్యుత్ ఉత్పత్తి సంస్థ NHPC లిమిటెడ్, దాని జాయింట్ వెంచర్ సంస్థ NHDC లిమిటెడ్ జాయింట్‌గా 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.60 లక్షల వరకు వేతనం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 27, 2026
- దరఖాస్తుకు లాస్ట్ డేట్: డిసెంబర్ 26, 2026
ఖాళీల వివరాలు
మొత్తం 205 పోస్టులలో NHPC లిమిటెడ్‌లో 188 పోస్టులు, NHDC లిమిటెడ్‌లో 17 పోస్టులు ఉన్నాయి.
- NHPC సివిల్: 64 పోస్టులు
- NHPC ఎలక్ట్రికల్: 76 పోస్టులు
- NHPC మెకానికల్: 48 పోస్టులు
- NHDC ఎలక్ట్రికల్: 12 పోస్టులు
- NHDC మెకానికల్: 5 పోస్టులు
ఈ మొత్తం 205 పోస్టులలో దివ్యాంగ అభ్యర్థుల కోసం 8 పోస్టులు రిజర్వ్ చేశారు. ఇందులో NHPC సివిల్-2, NHPC ఎలక్ట్రికల్-3, NHPC మెకానికల్-1, NHDC ఎలక్ట్రికల్-1, NHDC మెకానికల్-1 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు
అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. డిసెంబర్ 26 నాటికి AICTE గుర్తింపు పొందిన ఇండియన్ వర్సిటీ లేదా ఏదైనా సంస్థ నుంచి ఫుల్-టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. మే 31, 2013న లేదా అంతకు ముందు AMIEలో చేరిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనరల్, EWS, OBC (NCL) అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
సెలెక్షన్ ప్రాసెస్
- GATE 2025 లేదా GATE 2026లో నార్మలైజ్డ్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ప్రతి కేటగిరీలోని ఖాళీల సంఖ్యకు మ్యాగ్జిమం 5 రెట్లు గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
- గేట్ స్కోర్‌కు 75 శాతం, వ్యక్తిగత ఇంటర్వ్యూకు 20 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 5 శాతం వెయిటేజ్ ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
అప్లికేషన్ ఫీజు
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మొత్తం రూ.708 ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. Also Read: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా NHPC అధికారిక వెబ్‌సైట్ https://www.nhpcindia.com/ ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలోని 'Career' పార్ట్ లో నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత, విద్యార్హత, గేట్ వివరాలను నమోదు చేయాలి.
- పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సైన్, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి, ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. Also Read: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
