అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 1,534 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి (AP SLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులతో పాటు 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 27న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (slprb.ap.gov.in) ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని నియామక మండలి సూచించింది.
ఎగ్జామ్ డేట్స్..
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా పరీక్షల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు జనవరి 31న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనుండగా, ఎస్‌ఐ అభ్యర్థులకు ఫిబ్రవరి 28న రాత పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల రోజున ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్ ఎస్సై ఉద్యోగాలు
నవంబర్ 27న సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్-1 ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్-2 ఎగ్జామ్ నిర్వహిస్తారు
సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్‌లు, జైళ్ల శాఖ వార్డర్ ఉద్యోగాలు
నవంబర్ 27న సాయంత్రం 5 నుంచి డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.
కమ్యూనికేషన్స్ విభాగం ఎస్సై, పీటీవో, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల సైంటిఫిక్ అసిస్టెంట్‌లు, కమ్యూనికేషన్స్ విభాగం కానిస్టేబుళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు, పీటీవోలో డ్రైవర్ అండ్ మెకానిక్‌లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.
