NFSU Recruitment: గాంధీనగర్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో సైంటిఫిక్‌/ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 25. 


⏩ డిప్యూటీ డైరెక్టర్‌: 02 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ డిజిటల్ ఫోరెన్సిక్స్: 01 పోస్టు


➥ ఫోరెన్సిక్ సైకాలజీ: 01 పోస్టు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.   


గరిష్ఠ వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు. సెంట్రల్/స్టేట్/యూటీ ప్రభుత్వం/యూనివర్శిటీ/బోర్డ్/కార్పోరేషన్ సేవలో ఉన్న అభ్యర్థికి గరిష్ట వయోపరిమితి వర్తించదు.


పే స్కేల్: రూ.78800 – రూ.209200.


⏩ సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 05 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ బాలిస్టిక్స్: 01 పోస్టు


➥ సైబర్ సెక్యూరిటీ: 01 పోస్టు


➥ డిజిటల్ ఫోరెన్సిక్స్: 02 పోస్టులు


➥ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ టెస్టింగ్/ ఫుడ్ ఫోరెన్సిక్స్: 01 పోస్టు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.   


గరిష్ఠ వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. సెంట్రల్/స్టేట్/యూటీ ప్రభుత్వం/యూనివర్శిటీ/బోర్డ్/కార్పోరేషన్ సేవలో ఉన్న అభ్యర్థికి గరిష్ట వయోపరిమితి వర్తించదు.


పే స్కేల్: రూ.56100 – రూ.177500.


⏩ జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 10 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఫోరెన్సిక్ నార్కోటిక్స్/ ఎన్‌డీపీఎస్‌: 01 పోస్టు


➥ సైబర్ సెక్యూరిటీ: 01 పోస్టు


➥ డిజిటల్ ఫోరెన్సిక్స్: 02 పోస్టులు


➥ డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్: 01 పోస్టు


➥ ఫోరెన్సిక్ సైకాలజీ: 01 పోస్టు


➥ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ టెస్టింగ్/ ఫుడ్ ఫోరెన్సిక్స్: 02 పోస్టులు


➥ ఫోరెన్సిక్ అకౌంటింగ్: 01 పోస్టు


➥ మల్టీమీడియా ఫోరెన్సిక్స్: 01 పోస్టు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.   


గరిష్ఠ వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. సెంట్రల్/స్టేట్/యూటీ ప్రభుత్వం/యూనివర్శిటీ/బోర్డ్/కార్పోరేషన్ సేవలో ఉన్న అభ్యర్థికి గరిష్ట వయోపరిమితి వర్తించదు.


పే స్కేల్: రూ.44900 – రూ.142400.


⏩ సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 08 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఫోరెన్సిక్ నార్కోటిక్స్/ ఎన్‌డీపీఎస్‌: 01 పోస్టు


➥ సైబర్ సెక్యూరిటీ: 01 పోస్టు


➥ డిజిటల్ ఫోరెన్సిక్స్: 01 పోస్టు


➥ డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్: 01 పోస్టు


➥ ఫోరెన్సిక్ సైకాలజీ: 01 పోస్టు


➥ మల్టీమీడియా ఫోరెన్సిక్స్: 01 పోస్టు


➥ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ టెస్టింగ్/ ఫుడ్ ఫోరెన్సిక్స్: 02 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.   


గరిష్ఠ వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. సెంట్రల్/స్టేట్/యూటీ ప్రభుత్వం/యూనివర్శిటీ/బోర్డ్/కార్పోరేషన్ సేవలో ఉన్న అభ్యర్థికి గరిష్ట వయోపరిమితి వర్తించదు.


పే స్కేల్: రూ.35400 – రూ.112400.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.04.2024.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..