National Institute of Technology Warngal Recruitment: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITW) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రిన్సిపల్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీచేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను డిప్యూటేషన్ విధానంలో, మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీచేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు..

* నాన్-టీచింగ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 10

1) ప్రిన్సిపల్- టెక్నికల్ ఆఫీసర్-ఎ: 02 పోస్టులుఅర్హత: ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)/ ఎంసీఏ.అనుభవం: సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్‌గా కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి.జీతం: రూ.1,44,200.

2) ప్రిన్సిపల్- స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్-ఎ: 01 పోస్టుఅర్హత: కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్/స్పోర్ట్స్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.అనుభవం: స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్‌(SAS)గా కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు సీనియర్ SASగా పనిచేసిన అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధ్యాన్యం ఉంటుంది.వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి.జీతం: రూ.1,44,200.

3) డిప్యూటీ రిజిస్ట్రార్: 02 పోస్టులుఅర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.అనుభవం: అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 9 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. డిప్యూటేషన్ విధానంలో అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో 50 సంవత్సరాలలోపు ఉండాలిజీతం: రూ.78,800.

4) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 పోస్టుఅర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్, లా విభాగాల్లో పీజీ ఉండాలి.అనుభవం: అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 9 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. డిప్యూటేషన్ విధానంలో అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి.జీతం: రూ.56,100.

5) టెక్నికల్ ఆఫీసర్: 01 పోస్టు అర్హత: ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)/ ఎంసీఏ. లేదా రాష్ట్రప్రభుత్వ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా 2-5 సంవత్సరాలు పనిచేస్తూ ఉండాలి.అనుభవం: అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 9 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. డిప్యూటేషన్ విధానంలో అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.జీతం: రూ.56,100.

6) అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులుఅర్హత: ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). లేదా ప్రథమ శ్రేణిలో డిప్లొమా (సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). అనుభవం: కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, మేనేజ్‌మెంట్ టెక్నాలజీ తదిదర సాఫ్ట్‌వేర్ అనుభవం ఉండాలి. వయోపరిమితి: 56 సంవత్సరాలలోపు ఉండాలి.జీతం: రూ.44,900.

వయోసడలింపు: దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: యూనివర్సిటీ నిబంధనల మేరకు.

చిరునామా: Registrar, National Institute of Technology, Warangal –506004.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:  09.09.2024 (23.59 hrs.)

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..