NIT Agartala Recruitment: త్రిపుర రాష్ట్రం అగర్తలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 9 డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 09
1) డిప్యూటీ రిజిస్ట్రార్: 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
2) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
3) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫస్ట్ క్లాస్ లేదా తత్సమాన గ్రేడ్‌లో బీఈ/బీటెక్(సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
4) సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫస్ట్ క్లాస్ లేదా తత్సమాన గ్రేడ్‌లో బీఈ/బీటెక్/ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ వారికి రూ.500, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్స్ షార్ట్‌లిస్టింగ్, సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది.
జీతం: డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు నెలకు రూ.78,800, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సైంటిఫిక్/ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.08.2024.
ALSO READ:
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్ర్కీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్ర్కీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..