నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 74
పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)-34, ఎస్సీ-11, ఎస్టీ-06, ఓబీసీ(ఎన్‌సీఎల్)-16, ఈడబ్ల్యూఎస్-07.
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో రెండేళ్ల ఎంబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం(మార్కెటింగ్)/అగ్రి బిజినెస్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్‌మెంట్/ఫారిన్ ట్రేడ్ /ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. (లేదా) 60 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్)తోపాటు ఎంఎస్సీ(అగ్రికల్చర్- సీడ్ సైన్స్ & టెక్నాలజీ/జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్/ఆగ్రోనమీ /సాయిల్ సైన్స్/అగ్రికల్చర్ కెమిస్ట్రీ/ఎంటమాలజీ /పాథాలజీ) అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 10 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో మూడేళ్లు/ఐదేళ్ల ఫుల్‌టైమ్ లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ/బీఎల్). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/ యూపీఐ పేమెంట్స్ ద్వా ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాతపరీక్ష విధానం..
ఓఎంఆర్ (OMR) విధానంలో మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో 100 మార్కులను అభ్యర్థి సంబంధిత సబ్జెక్టుల నుంచి, 50 ప్రశ్నలను జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజినింగ్ & జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అంటే ఒక్కో పోస్టుకు 5 మంది చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాంచీ (ఝూర్ఖండ్), లక్నో (ఉత్తర్ ప్రదేశ్), ఛండీగఢ్ (ఛండీగఢ్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్), న్యూఢిల్లీ (ఢిల్లీ), బెంగళూరు (కర్ణాటక), భోపాల్ (మధ్యప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), జైపూర్ (రాజస్థాన్), ముంబయి (మహారాష్ట్ర), గువాహటి (అస్సామ్), కోల్‌కతా (వెస్ట్ బెంగాల్).
జీతం: నెలకు రూ.40,000 - రూ.1,40,000.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2023.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 03 - 04.12.2023.
ALSO READ:
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టులు, వివరాలు ఇలా
➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు