Bigg Boss 7 Telugu Today Episode: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో కెప్టెన్సీ కోసం టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన టాస్కుల్లో ‘వీర సింహాలు’ టీమ్ పైచేయి సాధించి.. సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. వీరిలో గౌతమ్, శోభాశెట్టి, టేస్టీ తేజ, రతిక, యావర్, అర్జున్ ఉన్నారు. అయితే, ప్రతి వారం కెప్టెన్సీ ఎంపికలో ప్రత్యర్థి టీమ్ ఓట్లు కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. హౌస్‌మేట్లు అర్హులుగా ఎంపిక చేసిన కంటెస్టెంట్ మాత్రమే కెప్టెన్ అవుతున్నారు. ఈ వారం కూడా అలాగే ఉంటుందని హౌస్‌మేట్స్ భావించారు. అయితే, ‘బిగ్ బాస్’ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వీర సింహాల్లో తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే బాధ్యతను గర్జించే పులలకు అప్పగించాడు. ఈ సందర్భంగా వారికి ఒక టఫ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. 


బీన్ బ్యాగ్.. ఫుల్‌గా ఉంటేనే కెప్టెన్


కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్.. ‘బీన్ బ్యాగ్’లు ఇచ్చాడు. ఆ బ్యాగ్‌లపై కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న గౌతమ్, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతిక రోజ్, యావర్, అర్జున్‌ల ఫొటోలు ఉన్నాయి. వాటిలో తమకు నచ్చిన కంటెండర్ బీన్ బ్యాగ్‌ను ‘గర్జించే పులులు’ టీమ్ ధరించి.. అది ఖాళీ కాకుండా కాపాడుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో శివాజీ - అర్జున్ బ్యాగ్‌ను, అమర్  - శోభాశెట్టి, ప్రియాంక - టేస్టీ తేజా, అశ్వినీ - గౌతమ్, భోలే - రతిక బ్యాగ్‌లను ధరించారు. అయితే, ‘వీర సింహాలు’ టీమ్‌కు చెందిన యావర్‌ను చివరి క్షణాల్లో ఆట నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్‌కు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth) సంచాలకుడిగా వ్యవహరించాడు.


అశ్వినీ అమర్ మధ్య ఫైట్


ఈ టాస్క్‌లో అమర్ చాలా ఆవేశంతో కనిపించాడు. శోభా (Shobha Shetty) బ్యాగ్‌ను ధరించిన అమర్.. ఆమెను ఎలాగైనా కెప్టెన్ చేయాలనే లక్ష్యంతో గట్టిగానే ఆడాడు. ముందుగా భోలే, అశ్వినీల బ్యాగ్‌‌లను టార్గెట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమర్-అశ్వినీ మధ్య ఫైట్ జరిగింది. అశ్వినీ గేమ్ నుంచి ఔట్ అయ్యింది. అమర్ కొట్టాడని ఆరోపించింది. దీంతో అమర్‌.. కొట్టడం స్టార్ట్ చేసింది నువ్వే అన్నాడు. ఆ తర్వాత అమర్.. రతికాతో (Rathika Rose) కూడా ఫైట్ చేశాడు. సంచాలకుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్‌తో ఆమె మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే అమర్ విరుచుకుపడ్డాడు. దీంతో బ్యాడ్ బాయ్ అనే ట్యాగ్ తగిలించుకో అని రతిక అంది. ఆ తర్వాత అమర్.. శివాజీని టార్గెట్ చేసుకున్నాడు. ఆయన తగిలించుకున్న బ్యాగ్‌ను లాగేశాడు. దీంతో శివాజీ చెయ్యి కదిలింది. శివాజీ ఆడేందుకు సిద్ధంగా లేడని బిగ్ బాస్ ప్రకటించాడు. అనంతరం ప్రియాంక బ్యాగ్‌ను ఖాళీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ టాస్క్ సాగుతున్నంత సేపు శోభా శెట్టి అరుస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన అర్జున్.. ‘‘ఎందుకు అరుస్తున్నావ్? ఇక్కడ ఎక్కువ అరుస్తున్నది నువ్వే’’ అంటూ విరుచుకుపడ్డాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అమర్ ఈ టాస్క్‌లో గెలిచి శోభాశెట్టికి కెప్టెన్సీ అందించినట్లు తెలిసింది. 



Also Read: బిగ్ బాస్ ట్విస్ట్ కి షాక్ లో శివాజీ అండ్ టీమ్ - గౌతమ్, శివాజీ మధ్య బిగ్ ఫైట్!