మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కరీంనగర్, వనపర్తిలలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌టీచింగ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ(అగ్రికల్చర్/హార్టికల్చర్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 09లోగా ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవలెను. డిసెంబరు 14,15 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 20


★ గెస్ట్ టీచింగ్ అసోసియేట్


విభాగాలు:


➽ అగ్రోనమీ- 4


➽ జెనెటిక్స్&ప్లాంట్ బ్రీడింగ్- 2


➽ సాయిల్ సైన్స్&అగ్రికల్చర్ కెమిస్ట్రీ- 2


➽ ఎంటమాలజీ- 2


➽ ప్లాంట్ పాథాలజీ- 2


➽ హార్టికల్చర్- 2


➽ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్- 2


➽ అగ్రికల్చరల్ ఎకనామిక్స్- 2


➽ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్- 2


అర్హత: ఎంఎస్సీ(అగ్రికల్చర్/ హార్టికల్చర్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.


వేతనం: నెలకు పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.45,000, పీజీ అభ్యర్థులకు రూ.40,000.


దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.


ఈమెయిల్: mjpadmissioncell@gmail.com


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 


ఇంటర్వ్యూ తేదీ: 14, 15.12.2022


వేదిక: 6వ అంతస్తు, డీఎస్ఎస్ భవన్, మసాబ్‌ట్యాంక్, హైదరాబాద్.


దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 09.12.2022.


Notification 


Application 


Website 


Also Read:


తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ
తెలంగాణలో కొలువుల కుంభమేళా జరుగుతోందని, ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసిందని, యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్. కష్టపడి చదవండి, కలల్ని నిజం చేసుకోండి అంటూ తెలంగాణ రాష్ట్ర యువకులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్ర యువతకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు, అర్హతలివే!
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారిశుద్ధ్య విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 482 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీపీఎల్ కార్డు, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రూల్‌ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. సరైన అర్హతలుగల అభ్యర్థులు డిసెంబరు 9లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు! 
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...