MIDHANI: మిధానిలో 54 జూనియర్/సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌(మిధాని) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు.

Continues below advertisement

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌(మిధాని) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 1లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 54

Continues below advertisement

➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఫిట్టర్): 13 పోస్టులు

➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్): 02 పోస్టులు

➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్): 06 పోస్టులు

➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ): 20 పోస్టులు

➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్): 10 పోస్టులు

➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18.10.2023 నాటికి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.

పే స్కేల్: నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000. ఎస్‌ఓటీ పోస్టులకు రూ.21,900 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023.

Notification

Online Application

Website

ALSO READ:

ఐవోసీఎల్‌లో 1720 ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు, అర్హతలివే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1720 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలుగల అభ్యర్థులు నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola