Staff Nurse Merit List: తెలంగాణలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్‌ జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) డిసెంబ‌రు 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ జాబితాను అందుబాటులో ఉంచింది. స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించి ఇటీవల మార్కులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన డిసెంబ‌రు 29 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,094 స్టాఫ్‌నర్సులను నియమించనున్నారు. రాతపరీక్ష మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వాటిని మార్కులకు కలిపి మెరిట్ జాబితాను సిద్ధం చేసింది.


రాష్ట్రంలో మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్సర్ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని డిసెంబరు 18న తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను MHSRB విడుదల చేసింది. తాజాగా అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసింది.


ప్రొవిజినల్ మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


Website


ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 30 నుంచి జనవరి 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. మొత్తం 8892 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.


➥ డిసెంబరు 30న - 1200 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400.


➥ జనవరి 1న - 1350 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450.


➥ జనవరి 2న - 1500 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.


➥ జనవరి 3న - 1500 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.


➥ జనవరి 4న - 1500 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.


➥ జనవరి 5న - 1500 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500


➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.


➥ జనవరి 6న - 342 మంది అభ్యర్థులకు


➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 342