మెదక్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా సీనియర్‌ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్‌సబార్డినేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 26 లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. 


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 12


కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.


పోస్టుల వారీగా ఖాళీలు..


1) సీనియర్‌ సూపరింటెండెంట్: 01 పోస్టు


అర్హత: న్యాయ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


2) సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు


అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.


3) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -III: 01 పోస్టు


అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ పరీక్ష ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో హైయర్ గ్రేడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 


4) జూనియర్ అసిస్టెంట్: 02


అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 


5) టైపిస్ట్: 02 పోస్టు


అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ పరీక్ష ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో హైయర్ గ్రేడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 


6) డ్రైవర్: 01 పోస్టు


అర్హత: పదవతరగతి, తత్సమాన విద్యార్హతతో పాటు ఉర్దూ/హిందీ, ఇంగ్లీష్, తెలుగు చదవటం రాయడం వచ్చి ఉండాలి. వాలిడ్ లైట్ మోటార్ వైకిల్ డ్రైవింగ్ లైసెన్స్, సంబధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


7) ఆఫీస్‌సబార్డినేట్‌: 04 పోస్టులు


అర్హత: పదవతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


వయోపరిమితి: 18-34 ఏళ్లు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువలోగా సంబధిత చిరునామాకు చేరేలా పంపాలి.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Principal District and Sessions Judge, 
District Court Complex, 
Medak 502110.


దరఖాస్తు చివరి తేది: 26.11.2022.


Notification & Application


Website   



Also Read:


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


AP High Court Jobs: ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ‌స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ ​​నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..