లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్‌ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(హెచ్ఎఫ్ఎల్) దేశ‌వ్యాప్తంగా అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


వివరాలు...


పోస్టుల సంఖ్య: 80


1) అసిస్టెంట్: 50 పోస్టులు 


2)  అసిస్టెంట్ మేనేజర్: 30 పోస్టులు


Also Readదేశ రాజధానిలో 547 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

రీజియన్లవారీగా అసిస్టెంట్ పోస్టులు: 50.



  • సెంట్రల్ రీజియన్(ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్)-06,



  • ఈస్ట్ సెంట్రల్(బిహార్, జార్ఖండ్, ఒడిశా)-02,



  • ఈస్టర్న్(అసోం, సిక్కిం, త్రిపుర, వెస్ట్ బెంగాల్)-03,



  • నార్త్ సెంట్రల్(ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్)-06,



  • నార్తర్న్ (ఢిల్లీ, రాజస్థాన్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్యూకశ్మీర్, పంజాబ్)-02,



  • సౌత్ సెంట్రల్(కర్ణాటక)-04,



  • సౌత్ ఈస్ట్రర్న్(ఏపీ, తెలంగాణ)-10,



  • సదరన్(కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు)-02,



  • వెస్ట్రర్న్ (గోవా, గుజరాత్, మహారాష్ట్ర)-15.


  • రీజియన్లవారీగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: అన్ని రీజియన్లలో కలిపి మొత్తం 30 పోస్టులు.


Also Read:  కోల్ఇండియాలో 481 పోస్టులు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు


అర్హత: ఏదైనా డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూట‌ర్ స్కిల్స్‌ తప్పనిసరి.

వయోపరిమితి: 01.01.2022 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1994 - 01.01.2001 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.800.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

రాతపరీక్ష విధానం..
➦ మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.
➦ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50         
     మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ (అసిస్టెంట్) లేదా క్వాంటిటేటివ్
      ఆప్టిట్యూడ్(అసిస్టెంట్ మేనేజర్) 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి.
➦ పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు).
➦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.


Also Read:  6432 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తివివరాలు ఇలా! 

ఇంటర్వ్యూ ఇలా...
ఖాళీలను అనుసరించి ఆన్‌లైన్ రాతపరీక్షలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూకు ఎంపిక అభ్యర్థులకు మాత్రమే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల్లో సరైన అర్హతలు (వయసు, విద్యార్హతలు, పని అనుభవం) లేనిపక్షంలో వారికి ఇంటర్వ్యూ నిర్వహించరు.

జీతం: రూ.53,620.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. 

ముఖ్యమైన తేదీలు..


➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2022


➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.08.2022


➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు 7 నుంచి14 రోజుల ముందుగా.


➦ ఆన్‌లైన్ పరీక్షతేది (అసిస్టెంట్): 2022 సెప్టెంబర్/అక్టోబర్.


➦ ఆన్‌లైన్ పరీక్షతేది (అసిస్టెంట్ మేనేజర్): 2022 సెప్టెంబర్/అక్టోబర్.


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...