లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 9394 అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో మొత్తం 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించారు.


ఏడీవో పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ తమ రిజిస్ట్రేషన్ నెంబర్/ రూల్ నెంబర్, పుట్టినతేదీ/ పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 8న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.


LIC ADO అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి–licindia.in


Step 2: అక్కడ హోంపేజీలో అడ్మిట్ కార్డులకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 


Step 3: 'LIC ADO Admit Card 2023' లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. 


Step 4: అక్కడ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/ రూల్ నెంబర్, పుట్టినతేదీ/ పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి. 


Step 5: 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి. 


Step 6: కంప్యూటర్ స్క్రీన్ మీద 'LIC ADO Admit Card 2023' దర్శనమిస్తుంది. 


Step 7:  అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి పరీక్షరోజు వెంటతీసుకెళ్లాలి.


LIC ADO హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..


➥ ప్రిలిమినరీ పరీక్ష:
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. అయితే ఇంగ్లిష్ పరీక్షను (30 మార్కులు) కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. అంటే 75 మార్కులకే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. 


➥ మెయిన్ పరీక్ష:
మొత్తం 160 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి-50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి-35 ప్రశ్నలు-35 మార్కులు; ఇన్‌స్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ నుంచి-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇక ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు 160 మార్కులకు‌గాను 100 ప్రశ్నలు ఉంటాయి. 


జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నెలకు రూ.35,650-రూ.90,205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.


పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


పోలీసు అభ్యర్థులకు అలర్ట్, మార్చి 11న 'టెక్నికల్ విభాగం' రాతపరీక్షలు - హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఎస్‌ఐ తుది రాతపరీక్ష మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఎఫ్‌పీబీ) ఏఎస్‌ఐ తుది రాతపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్ర 5.30 గంటల వరకు జరగనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్‌ సెట్ పరీక్ష వాయిదా, ఈ తేదీ పరీక్ష మాత్రమే! కారణమిదే!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 13న జరగాల్సిన టీఎస్‌ సెట్ (TS SET) పరీక్ష వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. 13న జరగాల్సిన పరీక్ష షెడ్యూల్‌ను  మార్చి 10 లోగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మార్చి 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ సెట్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...