APPSC Group 2 Application: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 899 గ్రూప్-2 (Group-2) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు.  ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి.


గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


వివరాలు..


* గ్రూప్-2 పోస్టులు


ఖాళీల సంఖ్య: 899


➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333


➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566


ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..


➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.


➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్. 


➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.


➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.


➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.


➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్


➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.


➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.


నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు 
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు 
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్. 


➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.


➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్. 


➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.


➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్


➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 


➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 


➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు


విభాగాలవారీగా ఖాళీలు: ఏపీపీఎస్సీ-32, ఎకనామిక్స్ & స్టాటిటిక్స్-06, సోషల్ వెల్ఫేర్-01, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయ్స్-13, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్-02, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేషన్-07, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్-31, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-07, కమిషనర్ ఆఫ్ లేబర్-03, డైరెక్టర్ ఆఫ్ ఏనిమల్ హస్బెండరీ-07, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్-03, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)-08, డీజీ -ప్రిసన్స్ & కోరిలేషనల్ సర్వీసెస్-02, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్-02, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్-02, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ-08, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-01, పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్-19, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-04, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్-01, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్-03, ఇండస్ట్రియల్ ట్రైబ్యూనల్ కమ్ లేబర్ కోర్ట్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్-05, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్-12, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్-01, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-20, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్ & బి-07, ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్-02, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ & వాటర్ ఆడిట్-01, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్-01, కమిషనర్ ఆఫ్ ఆర్కియోలజీ అండ్ మ్యూజియమ్స్-01, ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్-01, ప్రివెంటివ్ మెడిసిన్-01, గవర్నమెంట్ టెక్స్ బుక్ ప్రెస్-01, కమిషనరల్ ఆఫ్ ఇండస్ట్రీస్-05, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్-02, టెక్నికల్ ఎడ్యుకేషన్-09, ఆర్‌డబ్ల్యూఎస్ & ఎస్-01. 



అర్హతలు..



వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.


ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2024.


Notification


Group2 Detailed Notification


Online Application


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...