లార్సెన్ అండ్ టుబ్రో( ఎల్ అండ్ టీ) సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో వివిధ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 5లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
* డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు.
విభాగాలు..
➥ సివిల్
➥ ఎలక్ట్రికల్
➥ మెకానికల్
➥ మెకాట్రానిక్స్
➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
➥ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్
➥ ఆటోమొబైల్
➥ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్/ సేఫ్టీ
➥ కంప్యూటర్ సైన్స్/ఐటీ
➥ మైనింగ్
➥ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్
➥ కెమికల్
➥ మెటలర్జీ
అర్హతలు..
➥ సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
➥ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ 30.06.2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.
➥ డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్/సైన్స్/ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులు.
➥ అకడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు.
వయోపరిమితి: 01.07.2001 నుంచి 30.06.2005 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరితేది: 05.04.2023.
Also Read:
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో 68 ఇంజినీర్ ఉద్యోగాలు, అర్హతలివే!
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 68 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టునిఅనుసరించి బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..