TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. నీట్‌, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

Continues below advertisement

తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్చి 31న వెల్లడించింది. కొత్త షెడ్యూలు ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్‌, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.

Continues below advertisement

టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఫీజు ఇలా..
దరఖాస్తు ఫీజుగా  ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ ఏడాది మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి; మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..

➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.

➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 

➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.

➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.

➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.

➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.

➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి

➥ పరీక్ష తేదీలు:  మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్; మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలు.

TSEAMCET Notification

Online Application

Website 

                                   

Also Read:

TSRJC CET - 2023: టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రంలోని  23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.  బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement