కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అయితే కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, నవంబరు 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 16 దరఖాస్తుకు చివరితేది. అయితే నవంబరు 9లోపు అప్లికేషన్ లింక్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేపడతారు.
వివరాలు...
* మొత్తం పోస్టులు: 4014
1) ప్రిన్సిపాల్: 278 పోస్టులు
2) వైస్ ప్రిన్సిపాల్: 116 పోస్టులు
3) ఫైనాన్స్ ఆఫీసర్: 07 పోస్టులు
4) సెక్షన్ ఆఫీసర్: 22 పోస్టులు
5) పీజీటీ: 1200 పోస్టులు
6) టీజీటీ: 2154 పోస్టులు
7) హెడ్ మాస్టర్: 237 పోస్టులు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణుల్వాలి. సీటెట్‌లో అర్హత సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత (LDCE - లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్) పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం ఇలా..
ముఖ్యమైన తేదీలు..
➨ నోటిఫికేషన్ వెల్లడి: 02.11.2022.
➨ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.11.2022.
➨ కంట్రోలింగ్ ఆఫీసర్ ద్వారా దరఖాస్తు లింక్ ఏర్పాటుకు చివరితేది: 09.11.2022.
➨ దరఖాస్తుకు చివరితేదీ: 16.11.2022.
➨ కంట్రోలింగ్ ఆఫీసర్ ద్వారా వెరిఫికేషన్‌కు చివరితేది: 23.11.2022.
➨ రాతపరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
Also Read:
పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!
దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 1 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..