దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 21న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
List of shortlisted candidates for interview to the post of TGTs
List of shortlisted candidates for interview to the post of PGTs
Cut off marks, dates and venue for Interview to the post of PGT and TGT
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్ ఆఫీసర్/ఏఈ/లైబ్రేరియన్/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పోస్టుల వివరాలు..
➥ 6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
1) అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు
2) ప్రిన్సిపాల్: 239 పోస్టులు
3) వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల
4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 1409 పోస్టులు
5) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 3176 పోస్టులు
6) లైబ్రేరియన్: 355 పోస్టులు
7) ప్రైమరీ టీచర్ (మ్యూజిక్): 303 పోస్టులు
8) ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు
9) అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 02 పోస్టులు
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో): 156 పోస్టులు
11) హిందీ ట్రాన్స్‌లేటర్ (హెచ్‌టీ): 11 పోస్టులు
12) సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ-యూడీసీ): 322 పోస్టులు
13) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్ఏ-ఎల్‌డీసీ): 702 పోస్టులు
14) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు
➥ 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-2599 పోస్టులు, ఓబీసీ-1731 పోస్టులు, ఈబ్ల్యూఎస్-641 పోస్టులు, ఎస్సీ-962 పోస్టులు, ఎస్టీ-481 పోస్టులు.
Also Read:
ఏఈఈ అభ్యర్థులకు అలర్ట్, ఆన్‌లైన్‌లో ఏఈఈ(సివిల్) పరీక్ష నిర్వహణ!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మే 21న ఏఈఈ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న అధికారికంగా ప్రకటించింది.
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..