Karnataka Bank PO Notification 2024: మంగళూరు ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌రంగ కర్ణాటక బ్యాంక్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(Probationary Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 30న ప్రారంభంకాగా.. డిసెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీచేస్తారు. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబరు 22న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 


వివరాలు..


* ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు (పీవో పోస్టులు)


అర్హతలు: ఏదైనా డిగ్రీ (లేదా) పీజీ డిగ్రీ (లేదా) లా డిగ్రీ (లేదా) సీఏ/సీఎస్/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


వయోపరిమితి: 01-11-2024 నాటికి 28 సంవత్సరాలలోపు ఉండాలి. 02-11-1996 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 


పరీక్ష విధానం: మొత్తం 225 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 202 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష, 25 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షలో కంప్యూటర్ అవేర్‌నెస్ 30 ప్రశ్నలు-30 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్, కరెంట్ అఫైర్స్) 50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. ఇక డిస్క్రిప్టివ్ పరీక్షలో 25 మార్కులకు రెండు ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.


పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, మంగళూరు, ధర్వాడ్/హుబ్లీ, మైసూరు, శివమొగ్గ, కలబుర్గీ. 


జీతం: ₹48,480 - ₹1,17,000.


సర్వీసు బాండ్: ఉద్యోగాలకు ఎంపికైనవారు సంస్థలో కనీసం 3 సంవత్సరాలపాటు విధిగా పనిచేసేందుకు సర్వీసు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. విఫలమైనవారు అపాయింట్‌మెంట్ లెటర్‌లో సూచించిన విధంగా లిక్విడేటెడ్ నష్టాలను చెల్లించవలసి ఉంటుంది.
అపాయింట్‌మెంట్ లెటర్. 


ముఖ్యమైన తేదీలు..


* నోటిఫికేషన్ తేదీ: 30-11-2024.


* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 30-11-2024.


* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10-12-2024.


* రాతపరీక్ష తేదీ: 22-12-2024.


Notification


Online Application


Website


ALSO READ:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి
ఏపీ వైద్యారోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  అర్హతలున్న ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబరు 10వ తేదీ లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...