జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కాంట్రాక్ట్/తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పాలేరు, మహబూబాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లలో అకడమిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్‌లైన్ విధానంలో, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
వివరాలు..
* అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్
స్పెషలైజేషన్లు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1000. డిడి రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్, పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
బయో-డేటా పంపాల్సిన ఈ-మెయిల్: pa2registrar@jntuh.ac.in
దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:
The Registrar
JNTUH Kukatpally,
Hyderabad -500085.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09.10.2023. 5.00PM
ALSO READ:
ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంస్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వ్యాప్‌కోస్ లిమిటెడ్‌లో 140 కంట్రోల్ ఇంజినీర్ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్, ఫీల్డ్ క్వాలిటీ అసూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..