పుదుచ్చేరి, కరైకాల్‌లోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ), ఎండీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 9వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


వివరాలు..


సీనియర్ రెసిడెంట్ 


మొత్తం ఖాళీలు: 136 పోస్టులు


1) జిప్‌మర్, పుదుచ్చేరి: 114

2) జిప్‌మర్, కారైకల్: 22

విభాగాలు: అనస్తీషియాలజీ క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎస్‌టీడీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జెరియాట్రిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఓబ్‌స్టెట్రిక్స్ గైనకాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సీఎంఆర్‌సీ, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్ అంకాలజీ, రేడియో-డయాగ్నోసిస్.


అర్హతలు: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ), ఎండీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31-01-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.


జీతం: రూ.67,700 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్ రూ.1,500; ఓబీసీ రూ.1,500; ఎస్సీ/ఎస్టీ రూ.1,200; దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: సంబధిత స్పెషలైజేషన్‌లో మొత్తం 80 మార్కులు, ఒకొక్క ప్రశ్నకు 2మార్కుల చొప్పున 40 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ (సింగిల్ బెస్ట్ రెస్పాన్స్ టైప్) ప్రశ్నలు ఉంటాయి.


సీబీటీ పరీక్ష కేంద్రాలు: చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుదుచ్చేరి.


ముఖ్యమైన తేదీలు..


🔰 దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: 19.11.2022.


🔰 దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09.12.2022.


🔰 హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 16.12.2022.


🔰 రాత పరీక్ష తేదీ: 18.12.2022.


Notification 


Online Registration


Website


Also Read: 


తెలంగాణలో కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు - పూర్తి వివరాలు ఇవీ!
హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్), కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా సంబంధిత చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 



NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
నోయిడాలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. సంబధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 30 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...