JK Bank Recruitment: జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకు అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.700. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు: రూ.500. సరైన అర్హతలున్నవారు మే 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 276


కేటగిరీ/ జిల్లా/ప్రాంతాల వారీగా ఖాళీలు..


➥ శ్రీనగర్: 28


➥ గాండెర్బల్: 10


➥ బారాముల్లా: 13


➥ బందిపోరా: 05


➥ అనంతనాగ్: 14


➥ కుల్గామ్: 08


➥ పుల్వామా:11


➥ షోపియాన్: 08


➥ బుద్గం: 10


➥ కుప్వారా: 08


➥ పూంచ్: 06


➥ రాజౌరి: 08


➥ జమ్మూ: 31


➥ సాంబ: 08


➥ ఉదంపూర్: 07


➥ రియాసి: 05


➥ కథువా: 09


➥ దోడా: 06


➥ రాంబన్: 05


➥ కిష్త్వార్: 06


➥ కార్గిల్: 05


➥ లేహ్: 07


➥ ఢిల్లీ: 13


➥ ముంబై: 16


➥ లక్నో: 06


➥ బెంగళూరు: 12


➥ 27. పూణే: 05


➥ చెన్నై: 02


➥ మొహాలి: 04


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 


వయోపరిమితి: 01.01.2024 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.


దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.700. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు: రూ.500.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.


పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.  జనరల్ అవేర్‌నెస్ &ఇంగ్లీష్ కాంప్రహెన్షన్- 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & రీజనింగ్ ఎబిలిటీ- 50 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది


స్టైపెండ్: నెలకు రూ.10,500.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.05.2024.


Notification


Website


 


ALSO READ:


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైనవారికి భారీగా జీతం!
India Post Payments Bank Limited Recruitment: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.  ఎంపికైనవారికి ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో పోస్టింగ్ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..