ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐటీ సంస్థలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్నవారు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆ వివరాలేంటో చూద్దాం.


1) ట్యాప్లెంట్- జావా డెలపర్
బెంగళూరులోని ట్యాప్లెంట్(Tapplent) సంస్థ Java Developer పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిగ్రీ బీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మిషన్-క్రిటికల్ సిస్టమ్‌ల కోసం అధిక-వాల్యూమ్, తక్కువ-లేటెన్సీ అప్లికేషన్‌లను రూపొందించాలి. డిజైన్ స్పెసిఫికేషన్‌లపై నైపుణ్యం అవసరం. స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో అనుభవం ఉండాలి. 
Notification & Online Application


2) వెబ్రే ఇన్వెంట్ - యూఐ డిజైనర్ 
Delhi'లోని వెబ్రే ఇన్వెంట్(Webreinvent) సంస్థ యూఐ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌తోపాటు 4 ఏళ్ల వరకు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటరాక్షన్ డిజైన్, విజువల్ డిజైన్ నైపుణ్యాలపై పట్టు ఉండాలి. Photoshop, Illustrator, XD, Figma లేదా Zeplin  తెలిసి ఉండాలి. 
Notification & Online Application


3) సీజీఐ - సాఫ్ట్‌వేర్ డెవలపర్ 
బెంగళూరులోని సీజీఐ (CGI) సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి. SSIS ETL డెవలపింగ్ నైపుణ్యాలు ఉండాలి. ఒరాకిల్, PL/SQL, డేటా ఇంటిగ్రేషన్ తెలిసి ఉండాలి. 
Notification & Online Application


4) ఎవిన్స్ టెక్నాలజీస్ - PHP డెవలపర్ 
చెన్నైలోని ఎవిన్స్ టెక్నాలజీస్ (Evince Technologies) సంస్థ PHP డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్స్‌లో ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి PHP ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉండాలి. అలాగే HTML, JavaScript, MySQL స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి.
Notification & Online Application


5) ఇన్ఫోకమ్ - డాట్‌నెట్ ప్రోగ్రామర్ 
కొచ్చిన్‌లోని ఇన్ఫోకమ్(Infocom) సంస్థ డాట్‌నెట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. ఫ్రెషర్స్‌తో పాటు ఏడాది నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్ అప్లికేషన్‌లను అందించాలి. ఇన్‌టైమ్‌లో ప్రాజెక్ట్‌లు పూర్తిచేయగలగాలి. డాట్‌నెట్ 3.5/ 4.0 ఫ్రేమ్‌వర్క్ (విజువల్ స్టూడియో 2008, 2012) నైపుణ్యాలు ఉండాలి. 
Notification & Online Application



Also Read:


CISF Recruitment: సీఐఎస్‌ఎఫ్‌లో 787 కానిస్టేబుల్ పోస్టులు - టెన్త్ అర్హత చాలు!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 787 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో  641 పోస్టులు పురుషులకు, మహిళలకు 69 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 77 పోస్టులు కేటాయించారు. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...