హైదరాబాద్‌లోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 34


➥ జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్): 20


➥ రీసెర్చ్ సైంటిస్ట్(ఆర్‌ఎస్): 04


➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 07


➥ ప్రాజెక్ట్ సైంటిస్ట్: 03


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/ బీఈ/ బీఎస్సీ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.


వయసు: 28-35 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: జేఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.31,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు రూ.56,000, రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు 10 పే కమిషన్


ప్రకారం జీతభత్యాలు అందుతాయి.  


ముఖ్యమైన తేాదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.03.2023.


➥ దరఖాస్తు చివరితేది: 07.04.2023.


Notification


Online Application


Website 



Also Read:


బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో 68 ఇంజినీర్‌ ఉద్యోగాలు, అర్హతలివే!
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 68 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టునిఅనుసరించి బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!
లార్సెన్ అండ్ టుబ్రో( ఎల్ అండ్ టీ) సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో వివిధ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 5లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...