ISRO Recruitment Notification: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO)లో ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 10న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబయి, న్యూఢిల్లీ, తిరువనంతపురం కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా పంపారు.
Click here to view the status of your application
ఇస్రోలో మొత్తం 526 అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ ఖాళీలకు ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్ పరిధిలో 54 పోస్టులు, శ్రీహరికోటలో 78 పోస్టులు ఉన్నాయి. ఇక అహ్మదాబాద్-31, బెంగళూరు-215, హసన్-17, హైదరాబాద్-54, న్యూఢిల్లీ- 02, శ్రీహరికోట-78, తిరువనంతపురం-129 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ లిటరసీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ తదితర పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
రాతపరీక్ష విధానం: రాతపరీక్షలో సింగిల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 120 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్/స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటాయి. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 50 శాతంగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. రాతపరీక్షలో అభ్యర్థులు కనబరచిన ప్రతిభ ఆధారంగా 1 : 5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. స్కిల్ టెస్టులో భాగంగా కంప్యూటర్ లిటరసీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. కంప్యూటర్ లిటరసీ టెస్టులో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 60 శాతంగా, ఇతరులకు 50 శాతంగా నిర్ణయించారు.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీలు: 526
1) అసిస్టెంట్: 342 పోస్టులు
2) జూనియర్ పర్సనల్ అసిస్టెంట్: 154 పోస్టులు
3) అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 16 పోస్టులు
4) స్టెనోగ్రాఫర్: 14 పోస్టులు
ప్రాంతాల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-31, బెంగళూరు-215, హసన్-17, హైదరాబాద్-54, న్యూఢిల్లీ- 02, శ్రీహరికోట-78, తిరువనంతపురం-129.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే
కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 24 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..