IBPS RRB Recruitment 2024: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS), రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(RRB)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (CRP) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి జూన్ 6న సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో  గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీచేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ జూన్ 7 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆన్‌లైన్‌ పరీక్షలతోపాటు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకుIBPS  అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జూన్‌ 7న విడుదల కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా జూన్‌ 7 నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్‌ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్ధులు రూ.175 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి సెప్టెంబరు, అక్టోబరులో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 


వివరాలు..


* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XIII, 2024 


1) గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3)


2) గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) 


భర్తీచేసే బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.


అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్ధులు రూ.175 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది


ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.06.2024.


➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 07.06.2024 - 27.06.2024.


➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 22.07.2024 - 27.07.2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2024.


➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌, 2024.


➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2024.


Window Notification


Website



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..