IBPS Clerks Recruitment 2024-2025: ఐబీపీఎస్‌ కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(CRP)-XIV నోటిఫికేషన్ విడుదలైంది. 2025-2026 సంవత్సరానికి సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) దరఖాస్తులు కోరుతోంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. క్లర్క్ పోస్టులకు జులై 1 నుంచి జులై 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 


వివరాలు..


* ఐబీపీఎస్‌ కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(CRP)-XIV  - క్లర్క్ నోటిఫికేషన్


ఖాళీల సంఖ్య: 6128. (ఏపీ 105, తెలంగాణ 104)


ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.


రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు
అండమాన్ నికోబార్:  01
ఆంధ్రప్రదేశ్: 105
అరుణాచల్ ప్రదేశ్: 10
అస్సాం: 75
బిహార్: 237
చండీగఢ్: 39
ఛత్తీస్ గఢ్: 119
దాద్రానగర్ హవేలీ: 05
ఢిల్లీ: 268
గోవా: 35
గుజరాత్: 236
హర్యానా: 190
హిమాచల్ ప్రదేశ్: 67
జమ్మూ కశ్మీర్: 20
జార్ఖండ్: 70
కర్ణాటక: 457
కేరళ: 106
లడఖ్: 03
మధ్యప్రదేశ్: 354
మహారాష్ట్ర: 590
మణిపూర్: 06
మేఘాలయ: 03
మిజోరం: 03
నాగాలాండ్: 06
ఒడిశా: 107
పుదుచ్చేరి: 08
పంజాబ్: 404
రాజస్థాన్: 205
సిక్కిం: 05
తమిళనాడు: 665
తెలంగాణ: 104
త్రిపుర: 19
ఉత్తర్ ప్రదేశ్: 1246
ఉత్తరాఖండ్: 29
వెస్ట్ బెంగాల్: 331


అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


వ‌యోపరిమితి: 01.07.2024 నాటికి 20-28 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1996 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 3 - 8 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీలవారీగా 35 - 40 సంవత్సరాలు; 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 


ప్రిలిమినరీ పరీక్ష (IBPS Clerks Prelims Exam Pattern): మొత్తం 100 మార్కులకు ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే  ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున.. గంట వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థి ప్రతి విభాగంలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ స్కోర్ దాటిన అభ్యర్థులను మాత్రమే ఖాళీలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.


మెయిన్ పరీక్ష (IBPS Clerks Main Exam Pattern): మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు. వీరిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2024.


➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ: 12.08.2024 - 17.08.2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2024.


➥ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): ఆగస్టు, 2024.


➥ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 2024.


➥ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబరు/ అక్టోబరు, 2024.


➥ మెయిన్ పరీక్ష తేదీ(ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): అక్టోబరు, 2024.


➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2025.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..