Indo Tibetan Border Police Constable: భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ), స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 248 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 13 నుంచి ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఖాళీల వివరాలు..
* కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు
ఖాళీల సంఖ్య: 248 పోస్టులు
కేటగిరీ: గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్)
క్రీడాంశాలవారీగా ఖాళీలు..
⦁ అథ్లెటిక్స్: 42 పోస్టులు (మెన్-27, ఉమెన్-15)
⦁ ఆక్వాటిక్స్: 39 పోస్టులు (మెన్-39)
⦁ ఈక్వెస్ట్రియన్: 08 పోస్టులు (మెన్-08)
⦁ స్పోర్ట్స్ షూటింగ్: 35 పోస్టులు (మెన్-20, ఉమెన్-15)
⦁ బాక్సింగ్: 21 పోస్టులు (మెన్-13 ఉమెన్-08)
⦁ ఫుట్‌బాల్: 19 పోస్టులు (మెన్-19)
⦁ జిమ్నాస్టిక్: 12 పోస్టులు (మెన్-12)
⦁ హాకీ: 07 పోస్టులు (మెన్-07)
⦁ వెయిట్ లిఫ్టింగ్: 21 పోస్టులు (మెన్-14, ఉమెన్-07)
⦁ ఉషు: 02 పోస్టులు (మెన్-02)
⦁ కబడ్డీ: 05 పోస్టులు (ఉమెన్-05)
⦁ రెజ్లింగ్: 06 పోస్టులు (మెన్-06)
⦁ ఆర్చరీ: 11 పోస్టులు (మెన్-04, ఉమెన్-07)
⦁ కయాకింగ్: 04 పోస్టులు (ఉమెన్-04)
⦁ కానోయింగ్: 06 పోస్టులు (ఉమెన్-06)
⦁ రోయింగ్: 10 పోస్టులు (మెన్-02 ఉమెన్-08)
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, క్రీడా ప్రతిభ ఆధారంగా.
పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.11.2023.
ALSO READ:
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,832 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,832 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అడకమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభంకాగా.. డిసెంబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
భారతీయ తపాలా శాఖ (ఇండియా పోస్ట్) దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా(Sports Quota ) కింద వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1899 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant )- 598 ఖాళీలు, సార్టింగ్ అసిస్టెంట్(Sorting Assistant)-143 ఖాళీలు, పోస్ట్‌మ్యాన్(Postman)-585 ఖాళీలు, మెయిల్ గార్డ్(Mail Guard )-03 ఖాళీలు, ఎంటీఎస్(Multi Tasking Staff- MTS)-570 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..