ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో వేలాది మంది ఉద్యోగులపై వేటు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో డ్రీమ్11 సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ స్పందించారు. ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు - ప్రధానంగా H1B వీసా సమస్యలతో పోరాడుతున్న వారికి - దేశానికి తిరిగి రావాలని బహిరంగ పిలుపునిచ్చారు. భారతీయ టెక్ కంపెనీల వృద్ధి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఈ ఉద్యోగులు సహాయపడగలరని ఆయన అన్నారు.


అమెరికాలో ఈ ఏడాదిలో దాదాపు  52,000 వేలకు పైగా టెక్ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు.. వచ్చే దశాబ్ద కాలంలో దేశీయ టెక్ సామర్థ్యాన్ని పెంచడానికి స్వదేశానికి తిరిగి రావాలని 'Come Back Home' నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని హర్ష్ జైన్ ట్వీట్ చేశారు. స్వదేశానికి తిరిగివచ్చిన వారికి తమ సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. డ్రీమ్ స్పోర్ట్స్ ఎల్లప్పుడూ "గ్రేట్ టాలెంట్, ప్రత్యేకంగా డిజైన్, ప్రొడక్ట్ & టెక్‌లో నాయకత్వ అనుభవంతో" కోసం వెతుకుతూనే ఉంటుందని ఆయన తెలిపారు.


రాబడి పడిపోవడం, ప్రక‌ట‌నల రాబ‌డి త‌గ్గడంతో చాలా సంస్థలు ఖ‌ర్చుల‌ను తగ్గించుకోవ‌డానికి వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించింది.  ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో సగం మంది వీడారు. Microsoft , Netflix, Zillow, Spotify సంస్థలు సైతం ఉద్యోగులకు వీడ్కోలు పలికాయి. వీరికి తాయిలాలు ప్రకటించి మరి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికాయి. 


ఒకవైపు విదేశీ టెక్ దిగ్గజ సంస్థలు నష్టాలతో కొట్టుమిట్టాడుతుండగా, డ్రీమ్ 11 సీఈవో హర్ష్ జైన్ మాత్రం భారతీయ టెక్ కంపెనీలు లాభదాయకతపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. తమ డ్రీమ్ 11 సంస్థ లాభాల్లో ఉందని తెలిపారు. 150 మిలియన్ల వినియోగదారులతో $8 బిలియన్ లాభంతో దూసుకుపోతుందన్నారు.


డ్రీమ్ 11 క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, బేస్ బాల్, హ్యాండ్‌బాల్ వంటి బహుళ క్రీడలకు ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఇది ఒక ఆన్ లైన్ ఆట ఇందులో వినియోగదారులు నిజ-జీవిత ఆటగాళ్ల యొక్క వర్చువల్ టీమ్ ని సృష్టించుకొని, ఈ ఆటగాళ్ల వాస్తవ మ్యాచ్ ల్లో ప్రదర్శనల ఆధారంగా పాయింట్లను సంపాదిస్తారు. తమ పోటీలలో గరిష్ట పాయింట్లను సాధించిన వినియోగదారుడు లీడర్-బోర్డులో మొదటి ర్యాంకును పొందుతారు. డ్రీమ్ 11 ఉచిత, చెల్లింపు పోటీలను అందిస్తుంది. ఒక పోటీలో చేరడానికి వినియోగదారు కొంత రుసుము చెల్లించి, నిజమైన నగదును గెలుచుకోవచ్చు. డ్రీమ్ 11 ఆటలో పాల్గొనడానికి, వినియోగదారు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వారి ప్రొఫైల్‌ను పాన్ కార్డు ఉపయోగించి ధృవీకరించుకోవాలి.


డ్రీమ్11 అనేది భారతదేశంలోనే మొదటి గేమింగ్ కంపెనీ. యునికార్న్ మరియు స్థాపకుడిగా మారిన మొదటి గేమింగ్ కంపెనీ. భారతదేశానికి నైపుణ్యం కలిగిన ప్రతిభను తిరిగి తీసుకురావాలని కోరుకునే దేశీయ టెక్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించాలనుకునే భారతీయ టెక్ అధిపతుల్లో హర్ష్ జైన్ కూడా ఉన్నారు.


హర్ష్ జైన్ ముంబయి నగరాన్ని మీడియా, గేమింగ్, ఫిన్‌టెక్ వంటి వివిధ రంగాలకు కేంద్రంగా ప్రోత్సహించడానికి.. నగరంలో 35 యునికార్న్స్, సూనికార్న్స్‌లతో ఏకంగా ఒక అసోసియేషన్‌నే-టెక్ ఎంటర్‌ప్రెన్యూయర్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబయి లేదా టీమ్ (TEAM) ను ఏర్పాటుచేశారు. హ్యాప్‌టిక్, బుక్‌మైషో, జెప్టో, రెబెల్ ఫుడ్స్ వంటి కంపెనీలు ఈ సంస్థలో భాగంగా కొనసాగుతున్నాయి.


 


:: Also Read ::


'మెటా' టెన్షన్, ఈ ఏడాదిలోనే అతిపెద్ద 'లే ఆఫ్'!


మస్క్ బాటలో మార్క్ - 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు!