చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 8 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్) - ఐటీ ప్రొఫెషనల్ (ఎంఎంజీ స్కేల్-2)
పోస్టుల సంఖ్య: 25
విభాగాలవారీగా ఖాళీలు..
1) బిజినెస్ అనలిస్ట్: 01
2) డేటా ఇంజినీర్: 02
3) క్లౌడ్ ఇంజినీర్: 01
4) డేటా సైంటిస్ట్: 01
5) నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్: 01
6) ఒరాకిల్ డీబీఏ: 02
7) మిడిల్‌వేర్ ఇంజినీర్: 01
8) సర్వర్ అడ్మినిస్ట్రేటర్: 02
9) రూటింగ్ & స్విచింగ్ ఇంజినీర్: 02
10) హార్డ్‌వేర్ ఇంజినీర్: 01
11) సొల్యూషన్ ఆర్కిటెక్ట్: 01
12) డిజిటల్ బ్యాంకింగ్ (RTGS/NEFT): 01
13) డిజిటల్ బ్యాంకింగ్ (డెబిట్ కార్డు, ఏటీఎం స్విచ్): 01
14) ఏటీఎం మేనేజ్డ్ సర్వీసెస్ & ఏటీఎం స్విచ్: 02
15) మర్చంట్ అక్విజిషన్: 01
16) డిజిటల్ బ్యాంకింగ్ (యూపీఐ, ఐబీ, ఎంబీ): 03
17) డిజిటల్ బ్యాంకింగ్ (రీకన్సీలియేషన్): 01
18) కంప్లైన్స్ & ఆడిట్: 01
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.11.2022 నాటికి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; 1984 అల్లర్ల బాధితులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతభత్యాలు: నెలకు రూ.48,170 -రూ.69,810. ఇతర భత్యాలు అదనం.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08.11.2022.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 30.11.2022.
Also Read:
రెప్కో బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హతలివే!
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'రెప్కో' బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 25 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో అప్రెంటిస్‌షిప్‌లు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..