చెన్నైలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 66 ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 66
పోస్టుల కేటాయింపు: యూఆర్-30, ఈడబ్ల్యూఎస్-05, ఓబీసీ-18, ఎస్సీ-09, ఎస్టీ-04.
➥ మేనేజర్ (లా): 08 పోస్టులు
అర్హత: లా డిగ్రీ. బార్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 27-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: రెండేళ్ల ప్రాక్టీస్ అనుభవం లేదా లా ఆఫీసర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ సీనియర్ మేనేజర్ (లా): 02 పోస్టులు
అర్హత: లా డిగ్రీ.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: రెండేళ్ల ప్రాక్టీస్ అనుభవం లేదా లా ఆఫీసర్‌గా 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ మేనేజర్(ఐఎస్ ఆడిట్): 03 పోస్టులు
అర్హత: ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. CISA/ DISA సర్టిఫికేషన్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: IS ఆడిట్ డొమైన్‌లో 2 సంవత్సరాల అనుభవం. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్‌లో హ్యాకింగ్, ఆడిట్/ సెక్యూరిటీ టూల్స్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
➥ సీనియర్ మేనేజర్(ఐఎస్ ఆడిట్): 02 పోస్టులు
అర్హత: ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. CISA/ DISA సర్టిఫికేషన్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: IS ఆడిట్ డొమైన్‌లో 4 సంవత్సరాల అనుభవం. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్‌లో హ్యాకింగ్, ఆడిట్/ సెక్యూరిటీ టూల్స్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
➥ మేనేజర్ (సెక్యూరిటీ): 03 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: త్రివిధ దళాలలో కమీషన్డ్ సర్వీస్‌తో, కెప్టెన్ ర్యాంక్ హోదాకు తగ్గకుండా కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
➥ చీఫ్ మేనేజర్ (రిస్క్): 02 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ & ఫుల్ టైం మ్యథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఫుల్ టైం ఎంబీఏ(ఫైనాన్స్) లేదా ఎంసీఏ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ క్యాడర్‌లో బ్యాంక్‌లో 8 సంవత్సరాల అనుభవం, ఇందులో రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ మేనేజర్ (సివిల్): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.
➥ మేనేజర్ (ఆర్కిటెక్): 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్)తోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి:01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.
➥ మేనేజర్(ఎలక్ట్రికల్) : 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.
➥ మేనేజర్ (ట్రెజరీ): 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. పీజీ డిగ్రీ(మేనేజ్‌మెంట్/బిజినెస్/ఫైనాన్స్/బ్యాంకింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాలు.
➥ మేనేజర్ (క్రెడిట్) : 20 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫైనాన్స్, అకౌంటింగ్). ఎంబీఏ(ఫైనాన్స్), సీఎఫ్‌ఏ/సీఎంఏ/సీఏ/సీబీసీఏ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాలు.
➥ మేనేజర్ (మార్కెటింగ్): 05 పోస్టులు
అర్హత: ఎంబీఏ, పీజీడీబీఎం(మార్కెటింగ్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్): 02 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ(పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్ఆర్/హెచ్ఆర్డీ) లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 4 సంవత్సరాలు.
➥ సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్): 01 పోస్టు
అర్హత: డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ(పర్సనల్ మేనేజ్‌మెంట్/హెచ్ఆర్/హెచ్ఆర్డీ) లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 7 సంవత్సరాలు.
➥ మేనేజర్ (ఫుల్‌స్టాక్ డెవలపర్): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ (ఫినాకిల్ కస్టమైజేషన్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ (డీబీ అడ్మిన్/ఓఎస్ అడ్మిన్): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ (డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ (టెస్టింగ్ అండ్ డిజిటల్ సర్టిఫికేట్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ డిజిటల్ బ్యాంకింగ్ (ఐబీ, ఎంబీ, యూపీఐ, ఐఓబీపే) : 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్ (ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ ): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
➥ మేనేజర్ - డిజిటల్ బ్యాంకింగ్ (డెబిట్ కార్డ్ స్విచ్, డీసీఎంఎస్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్)
వయోపరిమితి: 01.11.2023 నాటికి కొన్ని 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: 3 సంవత్సరాలు.
వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ,ఎస్సీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పేస్కేలు: రూ.48,170 - రూ.89,890 వరకు ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.
పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 06.11.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.11.2023.