ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్(Skilled) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 1,531 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2022(Indian Navy Recruitment 2022) కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31.


ముఖ్యమైన తేదీలు



  • నోటిఫికేషన్(Notification) జారీ చేసిన తేదీ - ఫిబ్రవరి 19, 2022

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్(Online Registration) ప్రారంభం- మార్చి 18, 2022 ఉదయం గం.10.00లకు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ముగింపు- మార్చి 31, 2022, సాయంత్రం 5.00 గంటలకు


ఉద్యోగ ఖాళీల వివరాలు



  • ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా మొత్తం 1,531 పోస్టులు భర్తీ చేస్తుంది.  


రిజర్వేషన్లు ప్రకారం 



  • జనరల్ కేటగిరీ - 697 పోస్టులు

  • ఈడబ్ల్యూఎస్ - 141 పోస్టులు

  • ఓబీసీ - 385 పోస్టులు

  • ఎస్సీ - 215 పోస్టులు

  • ఎస్టీ - 93 పోస్టులు


జీతం 



  • ఎంపికైన అభ్యర్థులు లెవల్ 2 (రూ. 19,900-రూ. 63,200) జీతం(Pay Scale) పొందుతారు.


అభ్యర్థుల వయో పరిమితి



  • కనీస వయస్సు 18 సంవత్సరాలు, దరఖాస్తు(Apply) చేయడానికి గరిష్టంగా 25 సంవత్సరాలు


Also Read: BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో భారీగా ఖాళీల భర్తీ, ఈ వారమే లాస్ట్‌ డేట్


ఉద్యోగ అర్హతలు


అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్ శిక్షణను పూర్తి చేసి ఉండాలి లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్(Army, Navy, Airforce) లో సాంకేతిక శాఖలో రెండు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్‌తో మెకానిక్ లేదా ఏదైనా సమానమైన పోస్ట్‌లో పనిచేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే వారు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్​ ఉండాలి.


Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్