Indian Navy Chargeman INCET 01/2023 Recruitment: ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET-01/2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 910 ఛార్జ్‌మ్యాన్ (Chargeman), సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Senior Draughtsman), ట్రేడ్స్‌మ్యాన్ మేట్ (Tradesman Mates) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల పరిశీలన ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తుది ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభంకానుండగా.. డిసెంబరు 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 - రూ.56,900 వరకు జీతంతోపాటు ఇతర భత్యాలు ఉంటాయి. 


వివరాలు..


* ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/ 2023)


ఖాళీల సంఖ్య: 910 పోస్టులు


I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్


➥ ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్): 22 పోస్టులు


➥ ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ): 20 పోస్టులు


➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 142 పోస్టులు


➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్): 26 పోస్టులు


➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌): 29 పోస్టులు


➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కార్టోగ్రాఫిక్): 11 పోస్టులు


➥ సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఆర్మమెంట్): 50 పోస్టులు


జీత భత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400.


II. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్


➥ ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 610 పోస్టులు


➜ ఈస్టర్న్ నావల్ కమాండ్: 09


➜ వెస్టర్న్ నావల్ కమాండ్: 565


➜ సౌతర్న్ నావల్ కమాండ్: 36


ట్రేడులు: కార్పెంటర్, సివిల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, సెంట్రల్ ఎయిర్ కండీషన్ ప్లాంట్ మెకానిక్, కంప్యూటర్ హార్డువేర్ & నెట్‌వర్క్ మెయింటనెన్స్,  కంప్యూటర్ ఆపరేటర్ & సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్ తదితర ట్రేడ్లు.


జీత భత్యాలు: నెలకు రూ.18,000-రూ.56,900.


అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 31.12.2023 నాటికి ఛార్జ్‌మ్యాన్/ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు 25 సంవత్సరాలు. సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: రూ.295. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.


ముఖ్య తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023.


Website


                       


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...