Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎంఆర్‌ పోస్టులు, వివరాలు ఇలా

Indian Navy Recruitment: నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2024-నవంబర్‌ 24 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది.

Continues below advertisement

Indian Navy Recruitment: నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2024-నవంబర్‌ 24 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 13 నుంచి మే 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

Continues below advertisement

వివరాలు..

* అగ్నివీర్(మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌)

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి: 01.11.2003 - 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ వివరాలు: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 13.05.2024.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 27.05.2024.

🔰 శిక్షణ ప్రారంభం: 2024, నవంబరులో.

Notification

Website

ALSO READ:

కేంద్ర సాయుధ బలగాల్లో 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌ (BSF), సీఆర్‌పీఎఫ్‌ (CRPF), సీఐఎస్‌ఎఫ్‌ (CISF), ఐటీబీపీ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB) ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి 'సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024' నోటిఫికేష‌న్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 24న విడుద‌ల చేసింది. దీనిద్వారా మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభంకాగా.. మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola