ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 227.
* షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2024 కోర్సు
1. జనరల్ సర్వీస్: 50 పోస్టులు
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 10 పోస్టులు
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 20 పోస్టులు
4. పైలట్: 25 పోస్టులు
5. లాజిస్టిక్స్: 30 పోస్టులు
6. నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 15 పోస్టులు
7. ఎడ్యుకేషన్: 12 పోస్టులు
8. ఇంజినీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్): 20 పోస్టులు
9. ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 60 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: నింబంధనల మేరకు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే అండ్ అలవెన్సుస్: నెలకు రూ.56100, ఇతర అలవెన్సులు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2023.
Also Read:
టీఎస్‌పీఎస్సీకి మే 'పరీక్షా'కాలం, పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణ! మే నెలలో 7 పరీక్షలు!
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు నియామక పరీక్షలన్నీ వాయిదాపడ్డాయి. అప్పటికే నిర్వహించిన పరీక్షలతోపాటు, భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మే నెలలో వివిధ నియామక పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తులు ప్రారంభించింది. మే 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలో 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా 7 పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో అత్యధికంగా 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఎన్‌సీఈఆర్‌టీలో 347 ఉద్యోగాలు- వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీచేస్తారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..