Indian Navy, BTech degree course: ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. జేఈఈ (మెయిన్)-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు..


* 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్)


* ఎగ్జిక్యూటివ్, టెక్నికల్


ఖాళీలు: 35 (మహిళలకు 10 ఖాళీలు కేటాయించారు)


కోర్సు ప్రారంభం: 2024 జులైలో.


అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి.


వయోపరిమితి: 02.01.2005 నుంచి 01.01.2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్)-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


మెరిట్ లిస్ట్: SSB మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించబడిన అభ్యర్థులు పోలీస్ వెరిఫికేషన్ మరియు క్యారెక్టర్ వెరిఫికేషన్ & ఎంట్రీలో ఖాళీల లభ్యతకు లోబడి నియమిస్తారు.


శిక్షణ:


⏩ ఎంపికైన అభ్యర్థులు నావల్ అవసరాలకు అనుగుణంగా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్కోర్సుకు క్యాడెట్‌లుగా చేర్చబడతారు. కోర్సు పూర్తయిన తర్వాత, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. క్యాడెట్‌సమోంగ్స్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ బ్రాంచ్ (ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్) పంపిణీ ప్రస్తుత విధానం ప్రకారం ఉంటుంది.


⏩ పుస్తకాలు మరియు రీడింగ్ మెటీరియల్‌తో సహా శిక్షణ మొత్తం ఖర్చును భారత నావికాదళం భరిస్తుంది. క్యాడెట్‌లకు అర్హత కలిగిన దుస్తులు మరియు మెస్సింగ్ కూడా అందించబడుతుంది.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాంరంభం: 06.01.2024.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2024.


Notification


Website


 


ALSO READ:


నేషనల్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 274 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి
నేషనల్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ (ఐఎన్‌సీ) అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 274 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో సైంటిస్ట్ 'B' పోస్టులు
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్ఓ) సైంటిస్ట్ 'B' ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.





మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..