IIT Bombay placements 2023-24: ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో (Campus Placements) మరోసారి సత్తా చాటారు. 2023-24 నియామక ప్రక్రియలో భాగంగా ఏకంగా 85 మంది విద్యార్థులు కోటి రూపాయలకుపైగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి మొత్తంగా 1340 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా.. వీరిలో 1188 మంది భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ ఉద్యోగాలకు IIT Bombay నుంచి ఎంపికయ్యారు. వీరిలో 63 మందికి అంతర్జాతీయ ఆఫర్లు కూడా వచ్చాయి. జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పనిచేసేందుకు ఎంపికయ్యారు.  వీరిలో 85మందికి కోటి రూపాయల కంటే ఎక్కువ వేతనంతో జాబ్ ఆఫర్లు వచ్చాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.3 కోట్లుగా ఉంది.


అత్యధికంగా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో రూ.34.94 లక్షలు, ఫైనాన్స్‌ విభాగంలో రూ.32.38 లక్షలు, ఐటీలో రూ.26.35 లక్షలు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్లకు రూ. 21.88 లక్షలు, కన్సల్టింగ్ రూ.18.68 లక్షలు సగటు వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2023-24 నియామకాల్లో సీజన్ ఫేజ్-1లో భాగంగా ఈ సాలరీ ప్యాకేజీని అందుకోనున్నారు. వీరిలో 63 మందికి అంతర్జాతీయ ఆఫర్లు కూడా వచ్చాయి. 


క్యూ కట్టిన పెద్ద కంపెనీలు..
ఐఐటీ బాంబే ఇటవల నిర్వహించిన క్యాంపస్ నియామక ప్రక్రియలో దేశవిదేశాలకు చెందిన 388 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 1188 మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలైన గూగుల్, యాపిల్, ఎయిర్‌బస్, యాక్సెంచర్, జేపీ మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందారు కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని వర్చువల్‌గా నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి.


ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో జాబ్స్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ-సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్/ బ్యాంకింగ్/ఫిన్ టెక్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ వంటి విభాగాలు ఉన్నాయి. తమ విద్యా సంస్థలో చదువుతోన్న 60 శాతం మంది విద్యార్థులు ఫేజ్-1లో ఉన్నారని చెబుతున్నారు ఐఐటీ అధికారులు. ఇందులో 63 మంది జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగ్‌పూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో జాబ్ ఆఫర్లు వచ్చాయి. 


ALSO READ:


జేఎన్‌టీయూహెచ్‌లో 'స్పేస్‌ టెక్నాలజీ' కోర్సు, ఇస్రోతో 'MOU'కు సన్నాహాలు
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో తొలిసారి స్పేస్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సు (BTech Course) అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పేస్‌ టెక్నాలజీకి (Space Technology) సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఇస్రో, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం అర్థించాలని జేఎన్‌టీయూ భావిస్తోంది. యూనివర్సిటీ ఆవరణలోనే స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించి ప్లానెటోరియాన్ని కూడా నిర్మించాలని యోచిస్తున్నట్టు సమాచారం. స్పేస్‌ టెక్నాలజీ విభాగం కోసం మొత్తంగా రూ.60 కోట్ల వరకు అవసరమవుతాయని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో రూ. 50 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మిగతా రూ.10 కోట్లను సైన్స్‌ & టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...