IIM Visakhapatnam Recruitment: విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జులై 24న సాయంత్రం 5 గంటల్లోపు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు జులై 31న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు హార్డ్‌కాపీలు సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అందిన దరఖాస్తులను తర్వాతి నియామక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు సెమినార్ ప్రజెంటేషన్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
సెమినార్ ప్రజెంటేషన్‌లో అర్హత సాధించినవారికే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఒకవేళ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించిన నేపథ్యంలో అభ్యర్థులకు ఉచితవసతి, విమాన ఛార్జీలు(షార్ట్ రూట్) చెల్లిస్తారు. ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైనవారికి రూ.1,59,100; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైనవారికి రూ.1,39,600; అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-1) పోస్టులకు ఎంపికైనవారికి రూ.1,01,500 - రూ.1,31,400; అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2) పోస్టులకు ఎంపికైనవారికి రూ.70,900 - రూ.71,000 బేసిక్ పే చెల్లిస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.
వివరాలు..
* టీచింగ్ ఫ్యా్కల్టీలు
➥ ప్రొఫెసర్
➥ అసోసియేట్ ప్రొఫెసర్
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్
సబ్జెక్టులు..
• మార్కెటింగ్ (సేల్స్ & డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్, బీ2బీ మార్కెటింగ్)
• ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
• ఆర్గనైజేషనల్ బిహేవియర్ & హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(HRM)
• డెసిషన్ సైన్సెస్
• ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్
• ఫైనాన్స్ & అకౌంటింగ్
• ఎకనామిక్స్ & సోషల్ సైన్సెస్
• స్ట్రాటజీ
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మంచి అకడమిక్ రికార్డు ఉండాలి. మంచి టీచింగ్ రికార్డు, ట్రైనింగ్, రిసెర్చ్ అనుభవంతోపాటు గుర్తింపు ఉన్న జర్నల్స్‌లో పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి.
అనుభవం..
* ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 10 సంవత్సరాల టీచింగ్/ఇండస్ట్రీ/రిసెర్చ్ అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 4 సంవత్సరాలు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్సీ, ఐసర్ లాంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఐఐఎం విశాటపట్నం నిబంధనల మేరకు విదేశీ వర్సిటీల్లో విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 6 సంవత్సరాల టీచింగ్/ఇండస్ట్రీ/రిసెర్చ్ అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్సీ, ఐసర్ లాంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఐఐఎం విశాటపట్నం నిబంధనల మేరకు విదేశీ వర్సిటీల్లో విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-1) పోస్టులకు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్సీ, ఐసర్ లాంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్లో కనీసం 3 సంవత్సరాల టీచింగ్/ఇండస్ట్రీ/రిసెర్చ్ అనుభవం ఉండాలి. ఐఐఎం విశాటపట్నం నిబంధనల మేరకు విదేశీ వర్సిటీల్లో విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2) పోస్టులకు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్సీ, ఐసర్ లాంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్లో కనీసం 3 సంవత్సరాల టీచింగ్/ఇండస్ట్రీ/రిసెర్చ్ అనుభవం ఉండాలి. ఐఐఎం విశాటపట్నం నిబంధనల మేరకు విదేశీ వర్సిటీల్లో విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతభత్యాలు..
* ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,59,100 (7th CPC) బేసిక్‌పేతోపాటు ఇతర భత్యాలు ఇస్తారు.
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,39,600 (7th CPC) బేసిక్‌పేతోపాటు ఇతర భత్యాలు ఇస్తారు.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-1) పోస్టులకు రూ.1,01,500 - రూ.1,31,400 (7th CPC) బేసిక్‌పేతోపాటు ఇతర భత్యాలు ఇస్తారు.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2) పోస్టులకు రూ.70,900 - రూ.71,000 (7th CPC) బేసిక్‌పేతోపాటు ఇతర భత్యాలు ఇస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామ:
The Chief Administrative Officer (Human Resources)
Indian Institute Of Management Visakhapatnam
Gambeeram (Village), Anandapuram (Mandal)
Visakhapatnam – 531 163
Andhra Pradesh, India.
ముఖ్యమైన తేదీలు..
✦ నోటిఫికేషన్ వెల్లడి: 26.06.2024.
✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2024.
✦ ఈమెయిల్ ద్వారా దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.07.2024.
✦ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 31.07.2024.
Notification (Teaching Faculties)