IIM Visakhapatnam Recruitment: విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సిస్టమ్స్), అకౌంటెంట్, సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 24న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 


వివరాలు..


* నాన్ టీచింగ్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 15.


1) జూనియర్ సూపరింటెండెంట్: 06 పోస్టులు


➥ విభాగాలు: అడకమిక్ ప్రోగ్రామ్స్ ఆఫీస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్స్, కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ఆలమ్నీ రిలేషన్స్.


➥ అర్హత: ఏదైనా డిగ్రీ. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.


➥ వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.


2) జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సిస్టమ్స్): 01 పోస్టు


➥ విభాగాలు: ఐటీ, సిస్టమ్స్, నెట్‌వర్కింగ్ etc.


➥ అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ-ఐటీ/కంప్యూటర్ సైన్స్). సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.


➥ వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.


3) అకౌంటెంట్: 01 పోస్టు


➥ విభాగాలు: ఫైనాన్స్, అకౌంట్స్.


➥ అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కామర్స్). సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.


➥ వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.


4) సీనియర్ సూపరింటెండెంట్: 01 పోస్టు


➥ విభాగాలు: డిజిటల్ మీడియా మార్కెటింగ్.


➥ అర్హత: ఏదైనా డిగ్రీ. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: డిగ్రీతో కనీసం 3 సంవత్సరాలు, పీజీ డిగ్రీతో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.


➥ వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.


5) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 02 పోస్టులు


➥ విభాగాలు: ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, డిజిటల్ మీడియా మార్కెటింగ్.


➥ అర్హత: ఏదైనా పీజీ డిగ్రీ. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: కనీసం 2 సంవత్సరాలు. 


➥ వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.


6) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 03 పోస్టులు


➥ విభాగాలు: ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, హెచ్ఆర్ & ఎస్టాబ్లిష్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్.


➥ అర్హత: ఏదైనా పీజీ డిగ్రీ. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: కనీసం 3 సంవత్సరాలు. 


➥ వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.


7) సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 పోస్టు


➥ విభాగాలు: ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్.


➥ అర్హత: మాస్టర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్). సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అనుభవం: కనీసం 10 సంవత్సరాలు. 


➥ వయోపరిమితి: 50 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.07.2024. (5 P.M.)


Notification (Non Teaching)


Online Application




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...