ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 89 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 12లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
వివరాలు..
* నాన్-టీచింగ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 89
పోస్టుల కేటాయింపు: జనరల్-54, ఈడబ్ల్యూఎస్-06, ఓబీసీ-18, ఎస్టీ-03, ఎస్సీ-08.
➥ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01
అర్హతలు: పీజీ డిగ్రీ (మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/మేనేజ్‌మెంట్). 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ టెక్నికల్ సూపరింటెండెంట్: 04
అర్హతలు: బీఈ/బీటెక్ (మెటలర్జికల్ ఇంజినీరింగ్/మెటీరియల్ సైన్స్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా ఎంఏ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఫిజిక్స్)/ ఎంఎస్ (ఐటీ/కంప్యూటర్ సైన్స్). 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ సెక్షన్ ఆఫీసర్: 02
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీతోపాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్): 01
అర్హతలు: 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (క్లినికల్ సైకాలజీ/కౌన్సెలింగ్ సైకాలజీ). 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 02
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీతోపాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ ఫిజియోథెరపిస్ట్ (మేల్): 01
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ(ఫిజికల్ థెరపీ). డిగ్రీతో 5 సంవత్సరాలు, పీజీతో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ స్టాఫ్ నర్స్: 06
అర్హతలు: ఇంటర్‌తోపాటు జీఎన్‌ఎం కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. నర్సింగ్ కౌన్సెల్ సభ్యత్వం తప్పనిసరి.
➥ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 01
అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. 2 సంవత్సరాల కోచింగ్ అనుభవం ఉండాలి.
➥ లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్: 01
అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ఇన్‌ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్)/ సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 10
విభాగాలు: ఏఐ, మెకానికల్, డిజైన్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్,
అర్హతలు: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీల లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. తగినంత అనుభవం ఉండాలి.
➥ అకౌంటెంట్: 09
అర్హతలు: 55 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉన్నవారికి ప్రాధాన్యం.
➥ జూనియర్ అసిస్టెంట్: 17
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
➥ జూనియర్ టెక్నీషియన్: 29
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమాతోపాటు తగినంత అనుభవం ఉండాలి.
➥ జూనియర్ లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్: 02
అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ఇన్‌ఫర్మేషన్ సైన్స్)/ సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.
➥ జూనియర్ హార్టికల్చరిస్ట్: 01
అర్హతలు: 55 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్/బోటనీ/హార్టికల్చర్. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు 45 సంవత్సరాలోపు, టెక్నిలక్ సూపరింటెండెంట్ పోస్టులక 40 సంవత్సరాలలోపు, ఇతర ఉద్యోగాలకు 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.11.2023.
ALSO READ:
➥ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, ఎంపికైతే రూ.1.4 లక్షల వరకు జీతం
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం
➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు