Indian Air Force Agniveervayu Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 'అగ్నిపథ్' స్కీంలో భాగంగా 'అగ్నివీర్ వాయు' నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ (02/ 2025) విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అక్టోబరు 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.


అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,000; నాలుగో ఏడాది రూ.40,000 చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేవారికి 'సేవానిధి ప్యాకేజీ' కింద మొత్తంగా రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.


వివరాలు..


* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(02/ 2025) బ్యాచ్ 


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/  తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 03.07.2004 నుంచి 03.01.2008 మధ్య జన్మించి ఉండాలి.


పరీక్ష ఫీజు: అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.


ఎంపిక విధానం: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


జీతం: ఎంపికైన వారికి నెలకు మొదటి సంవత్సరం రూ.30,000; రెండో సంవత్సరం రూ.33,000; మూడో సంవత్సరం రూ.36,000; నాలుగో సంవత్సరం రూ.40,000 చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేవారికి 'సేవానిధి ప్యాకేజీ' కింద మొత్తంగా రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08.07.2024.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: 28.07.2024.


➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 18.10.2024.


Notification


Website


ALSO READ


కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెరిగిందోచ్ - 46,617కి చేరిన మొత్తం ఖాళీల సంఖ్య
కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్ పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు పెరిగిన పోస్టుల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. మొత్తం 26,146 ఖాళీల భర్తీకి మొదట నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటికి మరో 20,471 పోస్టులను కలిపింది. అదనపు పోస్టులతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. ఇందులో పురుషులకు 41,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 5150 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, మార్చి 30న పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 3న ఆన్సర్ కీ విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించనుంది.
పెరిగిన పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...