తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోస్టాఫీస్ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలకు సంబంధించిన ఆరో జాబితాను పోస్టల్ శాఖ అక్టోబర్ 18న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.


AP-GDS-Result        Telangana GDS Result


దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో ఏపీ నుంచి 179 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 188 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం ఎంపికైన అభ్యర్థులకు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియపరుస్తారు. 


నవంబరు 3 లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి...
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 6లోగా సంబంధిత డివిజన్ హెడ్ ముందు తమ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించరు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.  


 


:: ఇవీ చదవండి ::


DSSSB Recruitment 2022: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...



స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..



సీడాక్‌‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...