భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్(భారత వాతావరణ శాఖ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ R&D, వాతావరణ శాస్త్రం మరియు దాని అనుబంధ ప్రోగ్రామ్‌లలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”, ప్రాజెక్ట్ సైంటిస్ట్“II”, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు“I”, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) ఖాళీలను భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 165
విభాగాలు: వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్, ఏవియేషన్ మెటియోరో లాజికల్ సర్వీసెస్.
పోస్టుల వారీగా ఖాళీలు..
ప్రాజెక్ట్ సైంటిస్ట్ “I”,“II”,“III”: 63
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీఈ/ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 35 - 45 ఏళ్లు ఉండాలి.
జీతం: ప్రాజెక్ట్ సైంటిస్ట్ “I”కు రూ.56,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ “II”కు రూ.67,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”కు రూ.78000 ఉంటుంది.
రీసెర్చ్ అసోసియేట్: 34
అర్హత: ఎమ్‌ఎస్/పిహెచ్‌డి లేదా తత్సమాన డిగ్రీ.
వయోపరిమితి: 35 ఏళ్లు ఉండాలి.
జీతం: రూ.47,000 ఉంటుంది.
జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్: 68
అర్హత:సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు ఉండాలి.
జీతం: ఎస్ఆర్ఎఫ్‌కు రూ.35,000, జేఆర్ఎఫ్‌కు రూ.31,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 9, 2022.
Website
Also Read
ఎన్‌సీసీతో ఆర్మీ ఆఫీసర్ కొలువులు, దరఖాస్తుకు సెప్టెంబరు 15 ఆఖరు!
ఇండియన్ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 15తో ముగియనుంది. వీటికి మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేర్చుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు. ఎన్‌సీసీలో చేరినవారిని ఆర్మీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పలు నియామక ప్రకటనల్లో కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్త్తోంది. అలాగే ఏడాదికి రెండుసార్లు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. డిగ్రీతోపాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read
ఎఫ్‌సీఐ 5043 ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఇదే!
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా 5043 కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు 5 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..